నీటి బొట్టు.. బతుకు మెట్టు !

World Water Day 2021_india
World Water Day 2021_india
  • ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22
  • 3 బిలియన్ల మందికి చేతులు శుభ్రంగా కడుక్కొవడం తెలియదు ఎందుకో తెలుసా?
  • 4.2 బిలియన్ల మందికి నీటి కొరత ఎందుకు?
  • నీటి అసలు విలువ మీకు తెలుసా? మరిన్ని విషయాలు ..

భూవిపై జీవం నీటితోనే అంకురించింది. సమస్త ప్ర‌కృతికి జలమే జీవనాధారం. సమస్త జీవరాశి నీరే ప్రాణాధారం. అటువంటి అత్యంత విలువైన నీటిని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేస్తోంది నేటి ప్రపపం నీటి దినోత్సవం ! ఇంత‌టి ప్రాధాన్య‌త క‌లిగిన శుభ్ర‌మైన‌, సుర‌క్షిత‌మైన తాగే నీటిని పొంద‌డం ప్రాథ‌మిక మాన‌వ హ‌క్కు.. అయితే, ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మందికి తాగ‌డానికి నీరు ల‌భించ‌ని స్థితిలో ఉంది నేటి ఆధునిక ప్ర‌పంచం ఉంది. ఎందుకో తెలుసా?

నీటి విలువ తెలుసా?
World-Water-Day-2021_india-2 నీటి బొట్టు.. బతుకు మెట్టు !

భూమిపై ఉన్న జీవుల‌కు అత్యంత ప్రాథ‌మిక అవ‌స‌రాల‌లో నీరు ఒక‌టి. ఇది దాహాన్ని తీర్చ‌డానికి మొద‌లు వ్య‌వ‌సాయం, పారిశ్రామిక‌ర‌ణ‌, ఒక దేశం సామాజిక శ్రేయ‌స్సు, ఆర్థిక వృద్ధిని సాధించ‌డానికి నీటి అవ‌స‌రం ఉంటుంది. ఇది ప్ర‌కృతి జీవుల‌కు ప్ర‌సాదించిన బ‌హుమ‌తి. అయితే, దీనిని అర్థం చేసుకునే విష‌యంలో మాన‌వులు ఘోరంగా విఫ‌ల‌మైన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, నేడు ప్ర‌పంచ జ‌నాభాలోని దాదాపు మూడింట రెండు వంతుల మంది తీవ్ర మైన నీటి కొర‌త‌ను ఎదుర్కొంటున్నారు. ఇందులో కోట్లాది మందికి సుర‌క్షిత‌మైన, శుభ్ర‌మైన నీటి ల‌భ్య‌త లేదు. రాబోయే కాలంలో నీటి కోసం ప్ర‌పంచ యుద్ధాలు జ‌రిగే ప‌రిస్థితులు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మార్చి 22నే ప్ర‌పంచ నీటి దినోత్సవం ఎందుకు?
World-Water-Day-2021_india-1 నీటి బొట్టు.. బతుకు మెట్టు !

భ‌విష్య‌త్తు లో నీటి వ‌న‌రుల కొర‌త మ‌రింత ప్ర‌మాదంలో ప‌డ‌కుండా ఉండేంద‌కు, ప్ర‌ప‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రికీ సుర‌క్షిత‌, శుభ్ర‌మైన నీటిని అందించే ల‌క్ష్యంతో ప్ర‌తి ఏడాది మార్చి 22న ప్ర‌పంచ నీటి దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాం. ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, ‘పర్యావరణం, ప్రగతి’ అనే అంశంపై బ్రెజిల్‌లోని రియో డీ జెనీరియో వేదికగా 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా పాటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అందజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది “వాల్యుయింగ్ వాటర్’ అనే థీమ్ ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఐరాస జరుపుతోంది.

ఐక్య రాజ్య సమితి ఏం చేస్తోంది?

ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ల మంది ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారని యుఎన్ నివేదిక సూచిస్తుంది. నేడు 4.2 బిలియన్ల మంది ప్రజలు నీటి కొర‌త‌తో పారిశుధ్యాన్ని నిర్వ‌హించ ‌లేక‌పోతున్నారు. దాదాపు 3 బిలియ‌న్ల మందికి స‌రిగ్గా చేతులు శుభ్రం చేసుకోవ‌డం అనే విష‌యం తెలియ‌దు. వీట‌న్నింటికి ప్ర‌ధాన కార‌ణం నీటి కొర‌త‌, స‌రైన పంపిణీ లేక‌పోవ‌డం. ఐరాస ప్ర‌ధాన ల‌క్ష్యం భ‌విష్య‌త్ త‌రాల‌కు ప‌రిశుభ్ర‌మైన నీరు, పారిశుధ్య వ్య‌వ‌స్థ‌ను అందించ‌డం. దీని కోసం రాబోయే 15 ఏండ్ల‌ల్లో దానికి అనుగుణంగా ప‌నిచేయ‌డం.

ప్రపంచ నీటి కొరతలో భారత్ స్థానమెంటో తెలుసా?
World-Water-Day-2021_india-9 నీటి బొట్టు.. బతుకు మెట్టు !

భారత్ లో దాదాపు 136 కోట్ల జనాభా ఉంది. పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీటి రంగంలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, దేశ ప్రజల్లో సురక్షితమైన తాగునీరు పొందకుండా ఉంటున్నవారు అధికంగానే ఉన్నారు. దీనికి ప్రధాన కారణాలు రెండు ఉన్నాయి. వాటిలో మొదటిది భూగర్భజలాలు తగ్గిపోవడం. రెండోది నీటి కాలుష్యం. నీటి విషయంలో భారత్ లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు వెలికితీయబడుతుంది భారత్ లోనే. వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం కొరకు ప్రతియేటా సుమారు 230 బిలియన్ మీటర్ల క్యూబిక్ గ్రౌండ్ వాటర్ వెలికితీయబడుతోంది. వాయవ్య, పశ్చిమ, మధ్య భారత భూభాగం 90 శాతం వ్యవసాయ భూమి భూగర్భజలాలపై ఆధారపడి ఉంది.

దేశంలో పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికరణ

భారత్ లో పెరుగుతున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణతో, అందుబాటులో ఉన్న ఉపరితల నీటి నాణ్యత తీవ్రంగా ప్రభావితమవుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం.. భారత్ లో 70 శాతం ఉపరితల జలాలు వినియోగానికి అనుకూలంగా లేవు. హానికరమైన రసాయనాలను కలిగి ఉన్న 40 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు ప్రతిరోజూ నదులు, ఇతర నీటి వనరులలోకి ప్రవేశిస్తున్నాయనే భయంకర నిజాన్ని వెల్లడించింది. గత రెండు దశాబ్దాలుగా, సంబంధిత మున్సిపాలిటీలు సరఫరా చేసే నీటి లభ్యత, తాగునీటి నాణ్యతను పెంచడానికి మెరుగైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. గ్రామీణ భారతం తాగడానికి, ఇంటిపనులకు ఉప‌యోగించుకోవ‌డానికి సుర‌క్షిత‌మైన నీటిని పొంద‌లేక‌పోతున్నదని తెలిపింది. దేశంలోని 21 శాతం వ్యాధులకు ప్ర‌ధాన కార‌ణం సుర‌క్షిత‌మైన‌ తాగునీరు ల‌భ్య‌త లేక‌పోవ‌డ‌మే. దాదాపు 100 మిలియన్లకు పైగా గృహాల్లోని పిల్లలకు సుర‌క్షిత‌మైన నీరు ల‌భించ‌డం లేదు.

World-Water-Day-2021_india-5 నీటి బొట్టు.. బతుకు మెట్టు !
నీటి స‌మ‌స్య‌ల‌కు కార‌ణాలు చాలానే ఉన్నయ్‌!

ప్రపంచవ్యాప్తంగా నీటి స‌మ‌స్య‌లు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మాన‌వ చ‌ర్య‌లే. ఇందులో ప్ర‌ధాన‌మైన‌వి మాన‌వ నిర్మితాలు. వాటితో మ‌రికొన్ని ప్ర‌ధాన‌మైన కార‌ణాలు ఇవిగో….

వాతావరణ మార్పు
మ‌న‌వ చ‌ర్య‌ల కార‌ణంగా వాతావ‌ర‌ణంలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. మ‌రీ ముఖ్యంగా భౌగోళికంగా చ‌ల్ల‌గా ఉండే ప్రాంతాలలో సైతం నేడు అధిక స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్నాయి. దీని కార‌ణంగా జ‌ల వ‌న‌రులు త‌రిగిపోతున్నాయి.

జనాభా పెరుగుద‌ల‌
సుర‌క్షిత‌మైన‌ నీటి డిమాండ్ ప్రపంచ జనాభాకు నేరుగా సంబంధం క‌లిగివుంది. నిరంతరం పెరుగుతున్న జనాభా కారణంగా ప్రజల అవసరాలను తీర్చడంలో సరఫరా వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పెరిగిన ఆదాయం కూడా నీటి కొరతకు కారణం అవుతుంది, ఎందుకంటే సంపన్న జీవనశైలి అతిగా నీటిని వినియోగిస్తోంది.

భూగర్భ జలమట్టం తగ్గిపోవడం
భూగర్భజలాలు సురక్షితమైన, ఉపయోగించదగిన అతి పెద్ద (సుమారు 30 శాతం) నీటి వనరుగా ఉంది. ప్ర‌స్తుతం తాగ‌డానికి, వ్య‌వ‌సాయానికి అతిగా వినియోగించ‌బ‌డుతోంది. భూగర్భజలాలు తగ్గిపోవడం ప్రపంచంలోని అన్ని జీవరాశులకు తీవ్రమైన ముప్పుగా మారుతోంది. ఇది ప్రధానంగా మానవుల వల్ల కలుగుతుంది.

World-Water-Day-2021_india-01 నీటి బొట్టు.. బతుకు మెట్టు !

నీటి వృథా
నీటిని వృథా చేయడం అనేది అత్యంత ఒత్తిడి కలిగించే సమస్యల్లో ఒకటి. ఇది సురక్షితమైన నీటి కొరతను కలిగిస్తుంది. రోజువారీ వాడ‌కంలో భారీగా నీటి వృథా అవుతున్న‌ట్టు ప‌లు స‌ర్వేలు పేర్కొంటున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్లు, అణు లేదా శిలాజ ఇంధన విద్యుత్ కేంద్రాలు, వీటి ద్వారా 90 శాతం శక్తిని ఉత్పత్తి చేసే శక్తి, రోజుకు 190 బిలియన్ గ్యాలన్ల నీటిని ఉపయోగిస్తాయి.

స‌మ‌స్య ప‌రిష్కారాలున్నాయా?
ప్ర‌స్తుతం ఉన్న నీటి కొర‌త‌ను త‌గ్గించ‌డానికి.. నీటి విలువ‌, మాన‌వాళి మ‌నుగ‌డ ప్ర‌యోజ‌నాలను ప్ర‌జ‌ల్లో వివ‌రించాలి. నీటి వినియోగంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి. మ‌రీ ముఖ్యంగా స‌రిప‌డినంత మాత్ర‌మే నీటిని వినియోగించుకోవాలి. వృథా చేయ‌కూడ‌దు. నీటి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయ‌డానికి విస్తృతంగా యంత్రాలు అందుబాటులోకి తీసుకురావాలి. అవ‌స‌రం లేన‌ప్పుడు కుళాయిల‌ను క‌ట్టేయాలి. నీటి నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చాలి.

నీటి రీసైక్లింగ్
పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థజలాలను రీసైక్లింగ్ చేయడం నీటి కొరత సమస్యను ఎదుర్కోవడానికి నిస్సంకోచంగా అంగీకరించే పరిష్కారం. ఐక్యరాజ్యసమితి ప్రకార౦, “ప్రప౦చ౦లోని వ్యర్థజలాలను పునర్వినియోగ౦ చేయడ౦, దాదాపు అన్ని శుద్ధి చేయని వాటిద్వారా, పర్యావరణాన్ని కాపాడుతూ, ప్రప౦చవ్యాప్త నీటి కొరతను తగ్గి౦చవ‌చ్చు” అని ఐక్యరాజ్యసమితి పేర్కొ౦ది.

వ‌ర్ష‌పు నీటిని నిల్వ చేయ‌డం, మెరుగైన నీటి మౌలిక సదుపాయాలు క‌ల్పించ‌డం కూడా ప్ర‌ధాన విష‌యాలుగా ఉన్నాయి.

Share this content:

Related Post