దర్వాజ-క్రీడలు
T20 World Cup 2021: దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో శ్రీలంకపై సౌతాఫ్రికా అద్భుత విజయం సాధించింది. శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా హ్యాట్రిక్‌తో చెలరేగినా.. డేవిడ్ మిల్లర్(13 బంతుల్లో 2 సిక్స్‌లతో 23 నాటౌట్) విధ్వంసంతో సౌతాఫ్రికాను విజయం వరించింది. మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక 72 పరుగులతో రాణించగా.. మిగత ఆటగాళ్లు స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాటపట్టారు. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంసీ, ప్రిటోరియస్ మూడేసి వికెట్లు తీశారు.
143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 19.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 146 రన్స్ చేసింది. చివరి ఓవర్ ఐదు బంతికి సౌతాఫ్రికా విజయం సాధించింది. కెప్టెన్ టెంబా బవుమా46 పరుగులతో రాణించగా, డెవిడ్ మిల్లర్, రబడాలు కీలక ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో హసరంగా మూడు వికెట్లు తీయగా.. చమీరా రెండు వికెట్లు పడగొట్టాడు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 15వ ఓవర్ చివరి బంతికి ఎయిడెన్ మార్‌క్రమ్(19)ను ఔట్ చేసిన హసరంగా.. తన మరుసటి 18వ ఓవర్‌లో తొలి రెండు బంతుల్లోనే బవుమా, ప్రెటోరియస్ లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.
నెలరోజులకు పైగా ఉగ్రరూపంలో లావా వెదజల్లుతున్న అగ్నిపర్వతం
Aryan Khan Drugs Case_ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు
పెగాసస్_దేశ ప్రజాస్వామ్యంపై దాడి !
ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ దొరికేనా…?
నేను బీజేపీ ఎంపీని.. ఈడీ నా జోలికి రాదు
Ind Vs Pak : భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్
టాస్ కాయిన్‌తో పాక్ ఎకానమీని పెంచుకుంటారట.. ప్రముఖ వ్యాపారవేత్త సెటైర్లు