Loading Now
Team India

భార‌త ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. బీసీసీఐ అన్ని కోట్లు ఎలా సంపాదిస్తుంది?

దర్వాజ-క్రికెట్

BCCI prize money for team India : టీ20 ప్ర‌పంచ క‌ప్ గ‌లిచిన భార‌త ఆట‌గాళ్ల‌పై బీసీసీఐ కోట్ల వ‌ర్షం కురిపించింది. టైటిల్ ప్రైజ్ మ‌నీ కంటే ఏకంగా 6 రెట్లు అధికంగా ప్రైజ్ మ‌నీ ప్ర‌క‌టించింది. ఐసీసీ మొత్తం ఆదాయంలో అధిక భాగం బీసీసీఐ నుంచి వస్తుంది అనే వాస్తవం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బలాన్ని తెలియ‌జేస్తుంది. ప్ర‌పంచంలోనే అత్యంత‌ ధనిక క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ రెండో స్థానంలో ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా కంటే 28 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది.

భార‌త ఆట‌గాళ్ల‌పై కాసులు వ‌ర్షం..

17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవడంతో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. చాలా కాలం నుంచి ఉన్న నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా ఆట‌గాళ్లు, సిబ్బందిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐI) ఉదారంగా కాసుల వర్షం కురిపించింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ చారిత్రాత్మక టైటిల్‌ గెలిచిన తర్వాత భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) టీమిండియాకు రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, ఇతర ఆటగాళ్లు కలిసి 1.4 బిలియన్ల భారతీయుల కలలు-అంచనాలను నెరవేర్చ‌డంతో బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇది ఐసీసీ టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ట్రోఫీ ప్రైజ్ మ‌నీ కంటే 6 రెట్లు ఎక్కువ కావ‌డం విశేషం.

బీసీసీఐ ఎంత సంపన్నమైనది?

టీ20 ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన తర్వాత టీమ్ ఇండియాకు రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన క్రికెట్ బోర్డు బీసీసీఐ ఎంత సంపన్నమైందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఒక నివేదిక ప్రకారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) మొత్తం సంపద సుమారు $295 మిలియన్లు (సుమారు రూ. 24,59,51,82,500)గా అంచనా వేయబడింది. అదే సమయంలో బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా కొన‌సాగుతోంది.

బీసీసీఐ ఎలా సంపాదిస్తుంది?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ మంచి ఆద‌ర‌ణ ఉంది. ఇక భారత్ లో అయితే ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. దీంతోనే బీసీసీఐ భారీగా ఆర్జిస్తోంది. భారత్‌లో క్రికెట్ మార్కెట్‌కు ప్రపంచంలోనే పోటీ లేదు. నిజానికి, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ వంటి దేశాలు భారత్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నాయి. ఎందుకంటే టీమ్ ఇండియా దానితో చాలా ఆదాయాన్ని తీసుకువ‌స్తుంది.

ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ చాలా బ‌ల‌మైన‌ది

ఐసీసీ మొత్తం ఆదాయంలో అధిక భాగం బీసీసీఐ నుంచి అందుతుందనే వాస్తవాన్ని బట్టి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బలాన్ని అంచనా వేయవచ్చు. ధనిక క్రికెట్ బోర్డు పరంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) రెండవ స్థానంలో ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా కంటే 28 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది. ముఖ్యమైన బీసీసీఐకి ఐడీఎఫ్సీ, డ్రీమ్ 11, పేటీఎం, హ్యూంద‌య్, టాటా వంటి దిగ్గ‌జ వ్యాపార సంస్థ‌ల స్పాన్సర్‌షిప్‌లతో అనుబంధం కలిగి ఉంది.

అత్యధిక ఆదాయ వనరుగా ఐపీఎల్

భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టి20 క్రికెట్ లీగ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడాలని తహతహలాడుతున్నారు. ఎందుకంటే ఈ లీగ్ ద్వారా క్రికెట‌ర్లు భారీగానే సంపాదిస్తున్నారు.బోర్డు స్పాన్సర్‌షిప్‌ల ద్వారా భారీగానే డబ్బు సంపాదిస్తుంది. బీసీసీఐకి ఐపీఎల్‌ అతిపెద్ద ఆదాయ వనరుగా ఉంది.

Share this content:

You May Have Missed