Breaking
Tue. Nov 18th, 2025

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు షాక్

Indian Cricket Team
Indian Cricket Team

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

ICC Test Rankings : తాజాగా విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకున్నారు. ఇదే సమ‌యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు షాక్ త‌గిలింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 899 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ వరుసగా రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నారు. ఆసీస్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ నాలుగవ స్థానంలో నిలిచాడు.

భారత యంగ్ ప్లేయ‌ర్ యశస్వి జైస్వాల్ ఐదవ స్థానంలో ఉన్నాడు. అతని అద్భుత ప్రదర్శనతో అతని ర్యాంకును మెరుగుప‌ర్చుకున్నాడు. భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ టాప్ 10లోకి ప్రవేశించి 6వ స్థానాన్ని దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పంత్ 39 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడం అతని ర్యాంకును మెరుగుప‌డింది.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 10వ స్థానానికి దిగజారాడు. విరాట్ కోహ్లీ 5 స్థానాలు దిగజారి 12వ ర్యాంక్‌లో నిలిచాడు. శుభ్‌మన్ గిల్ 14వ స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండవ టెస్టులో రోహిత్ శర్మ, కోహ్లీ రాణిస్తే వారి ర్యాంకులు మెరుగుపడే అవకాశం ఉంది.

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా 2వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ వరుసగా 3వ, 4వ స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ 5వ స్థానంలో నిలిచాడు. భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 6వ స్థానంలో నిలిచాడు. నాథన్ లియాన్ 7వ ర్యాంక్‌లో నిలిచాడు.

  • darvaaja-com-1753896210 ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు షాక్

    Weather: అతిభారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులు.. రెడ్ అలర్ట్

  • Neeraj-chopra-5 ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు షాక్

    Neeraj Chopra: నీరజ్ చోప్రా నిరాశపరిచాడు.. సచిన్ యాదవ్ మిస్సయ్యాడు?

  • Team-India-3 ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు షాక్

    Asia Cup 2025 Points Table : ఆసియా 2025 పాయింట్ల పట్టిక టాప్ లో టీమిండియా

Related Post