Breaking
Wed. Dec 4th, 2024

స్పెయిన్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. పారిస్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన భార‌త హాకీ జ‌ట్టు

ద‌ర్వాజ‌-క్రీడ‌లు

Indian Hockey Team : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. గురువారం (ఆగస్టు 8) జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను 2-1 తేడాతో ఓడించింది. ఈ విజయంలో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ కీలకపాత్ర పోషించాడు. వరుసగా పెనాల్టీ కార్నర్‌లలో రెండు గోల్స్ చేశాడు. ఒలింపిక్స్‌లో భారత్‌ వరుసగా రెండోసారి కాంస్యం సాధించింది. 52 ఏళ్ల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒలింపిక్ మెడ‌ల్స్ ల‌భించాయి. గతసారి టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని ఓడించి బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకుంది భార‌త్.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది నాలుగో మెడ‌ల్. ఇవ‌న్ని కూడా కాంస్య పతకాలే. పురుషుల హాకీ జట్టు ఒక‌టి, షూటింగ్‌లో మూడు మెడ‌ల్స్ ల‌భించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ బ్రాంజ్ మెడ‌ల్ గెలిచారు. అలాగే, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మ‌ను భాక‌ర్-సరబ్‌జోత్ సింగ్ లు కాంస్యం గెలిచారు. దీంతో పాటు పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో స్వప్నిల్ కుసాలే కూడా బ్రాంజ్ మెడ‌ల్ సాధించాడు.

బ్రాంజ్ మెడ‌ల్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేశాడు. 30, 33 నిమిషాల్లో పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మలిచాడు. దీని తర్వాత, చివరి నిమిషాల్లో స్పెయిన్ అద్భుత‌మైన క‌మ్ బ్యాక్ చేసింది. దీంతో స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్‌లు వరుసగా వ‌చ్చాయి. శ్రీజేష్ గోల్ పోస్ట్ ముందు తన ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డంతో స్పెయిన్ ముంద‌డుగు వేయ‌లేదు. ఇదే త‌న చివ‌రి మ్యాచ్ గా ప్ర‌క‌టించిన శ్రీజేస్.. ఈ మ్యాచ్‌లో టీమిండియాను ఓడిపోనివ్వకుండా కాపాడాడు. బ్రాంజ్ మెడ‌ల్ తో ఘ‌నంగా కెరీర్ కు వీడ్కోలు ప‌లికాడు.

Vinesh Phogat : రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ ఫోగట్

Share this content:

Related Post